బీజేపీ నాయకుడి కాలుపైకి దూసుకెళ్లిన హోంమంత్రి కారు.. తిరుమల పర్యటనలో అపశృతి

హోంమంత్రి అనిత తిరుమల పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది....

Update: 2024-06-22 16:29 GMT

దిశ, వెబ్ డెస్క్: హోంమంత్రి అనిత  తిరుమల పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీవారిని దర్శించేందుకు ఆమె తిరుపతి వెళ్లారు. అయితే తిరుమల వెళ్తుండగా అలిపరి గరుడ సర్కిల్ వద్ద హోంమంత్రి కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆమె కారు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రభాకర్ కాలుకు తీవ్ర గాయమయింది. పోలీసులు వెంటనే ప్రభాకర్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభాకర్‌ కాలుకు చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన దురదృష్టకరమని, ప్రభాకర్ కాలు గాయం త్వరగా తగ్గాలని హోంమంత్రి కోరుకున్నారు. ప్రభాకర్‌కు మెరుగైన వైద్యం అందిస్తామని వంగలపూడి అనిత తెలిపారు. 


Similar News