తప్పు చేస్తే TDP నేతలైనా సరే వదిలేదే లేదు.. హోం మినిస్టర్ అనిత వార్నింగ్
ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో జరుగుతోన్న దాడులపై తాజాగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో జరుగుతోన్న దాడులపై తాజాగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయో.. లేక వాళ్లే కావాలని చేసుకుంటున్నారో విచారణ జరిపిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే టీడీపీ నేతలు అయిన సరే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రతికార చర్యలు ఉండబోవని సీఎం చంద్రబాబు చెప్పాక.. టీడీపీ నేతలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారని అన్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావు పేట నియోజకవర్గం నుండి విజయం సాధించిన వంగలపూడి అనిత.. చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. వంగలపూడి అనితకు చంద్రబాబు కీలకమైన రాష్ట్ర హోంశాఖ బాధ్యతలను అప్పగించారు.
Read More: సీఎం చంద్రబాబు హెచ్చరికలతో జారుకునే ప్రయత్నం.. చెక్ పెట్టిన సీఎస్