తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. ఎండ తీవ్రతకు ఎంత మంది మృతి అంటే..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.

Update: 2023-04-19 06:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలోని 13 జిల్లాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాడగా.. నలుగురు వడగాల్పులకు మృతి చెందినట్లు తెలుస్తోంది.

AP లో ఇవాళ విశాఖ, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, పల్నాడు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వేడిగాల్పులు వీస్తాయని IMD హెచ్చరించింది. ఈ మేరకు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటొచ్చని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ.

Tags:    

Similar News