చంద్రబాబు బెయిల్ షరతులపై హైకోర్టు తీర్పు..ఉత్తర్వులు ఇవే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2023-11-03 05:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ స్కాం కేసులో నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడుకు హైకోర్టు పలు కండీషన్లు విధించింది. ఇకపై చంద్రబాబు నాయుడు పొలిటికల్ ర్యాలీల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. అలాగే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ఎవరితోనూ చర్చించ వద్దు అని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇద్దరు సీఐడీ డీఎస్పీల పర్యవేక్షణ ఉంచాలంటూ సీఐడీ అభ్యర్థనను తిరస్కరించింది. చంద్రబాబు నాయుడుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణ అవసరం లేదని స్పష్టం చేసింది.  

కీలక ఉత్తర్వులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండీషన్స్‌పై సీఐడీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ కేసుపై ఇరువురు వాదనలు విన్న హైకోర్టు వాదనలు ముగిసినట్లు ప్రకటించింది. అయితే తదుపరి తీర్పును ఈనెల 3న వెల్లడిస్తామని తెలిపింది. దీంతో శుక్రవారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు ఐదు షరతులు ఏదైతే విధించిందో వాటినే అమలు చేయాలని సూచించింది. అయితే చంద్రబాబు నాయుడు పొలిటికల్ ర్యాలీలో పాల్గొనవద్దని... స్కిల్ స్కాం కేసు గురించి ఇతరులతో చర్చించ వద్దు అని ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇదే సందర్భంలో సీఐడీ డీఎస్పీల పర్యవేక్షణ అవసరం లేదని తెలిపింది. ఇకపోతే చంద్రబాబు నాయుడుకు నాలుగు వారాలపాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐదు కండీషన్లను పెట్టింది. అలాగే లక్షరూపాయల పూచీకత్తు ఇద్దరు షూరిటీలతో మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

సీఐడీ వాదనలు ఇవే

మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు నాయుడు విడుదలకానున్న నేపథ్యంలో సీఐడీ మరో పిటిషన్ వేసింది. చంద్రబాబు నాయుడుపై పలు ఆంక్షలు విధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాకుండా.. భారీ ర్యాలీలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టును సీఐడీ కోరింది. అలాగే చంద్రబాబుకు సీఐడీ డీఎస్పీల పర్యవేక్షణకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. అయితే మంగళవారం మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడు మీడియాను, ప్రజలను అడ్రెస్ చేస్తూ ప్రసగించడాన్ని సీఐడీ తప్పుబట్టింది. ఇది కోర్టు నిబంధనలు ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది.ఈ మేరకు వీడియో క్లిప్పింగ్స్‌ను పెన్‌డ్రైవర్‌లో న్యాయస్థానానికి సీఐడీ తరఫు న్యాయవాది అందజేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ చంద్రబాబు మీడియాతో మాట్లాడారని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు. ర్యాలీలు నిర్వహించ వద్దని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నాయని చెప్పిన చేశారని కోర్టుకు సీఐడీ తెలిపింది. మధ్యంతర బెయిల్ వచ్చిన తొలిరోజే చంద్రబాబు నిబంధనలను ఉల్లంఘించారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు

హైకోర్టులో సీఐడీ ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలను ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు అతిక్రమించలేదని ఆయన తరఫు న్యాయవాదలు వాదించారు. చంద్రబాబు మాట్లాడటం అనేది ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమించడం కాదని చెప్పుకొచ్చారు. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో న్యాయస్థానాలు కల్పించాయి అని చెప్పుకొచ్చారు. సీఐడీ విధించే షరతులు అన్నీ చంద్రబాబు హక్కులు హరించే విధంగా ఉన్నాయని వాదించారు. ఇవి కేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో సీఐడీ అధికారులు చెప్పలేకోతున్నారు అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. నవంబర్ 3న తీర్పు వెల్లడిస్తామని తెలిపిన న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెల్లడించారు.  

Tags:    

Similar News