BREAKING: వైసీపీ కార్యాలయాలకు నోటీసులపై హై కోర్టు స్టేటస్ కో

వైసీపీ కార్యాలయాల కూల్చివేత ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పలుచోట్ల వైసీపీ కార్యాలయాలను

Update: 2024-06-26 11:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కార్యాలయాల కూల్చివేత ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పలుచోట్ల వైసీపీ కార్యాలయాలను అధికారులు కూల్చివేశారు. మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండా నిర్మించారంటూ వైసీపీ ఆఫీస్‌లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయాలను కూల్చడం, నోటీసులు ఇవ్వడంపై వైసీపీ హై కోర్టును ఆశ్రయించింది. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 10 జిల్లా కార్యాలయాలకు సంబంధించిన కూల్చివేతలు, నోటీసుల గురించి వైసీపీ పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. వైసీపీ కార్యాలయాల కూల్చి వేతలకు ప్రభుత్వం సిద్ధమైందని ఆ పార్టీ తరుఫు లాయర్ వాదించారు. తాను ప్రభుత్వం నుండి వివరణ తీసుకున్నా తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తామని ప్రభుత్వ తరుఫు న్యాయవాది తెలిపారు. ఇప్పటికిప్పుడు వైసీపీ కార్యాలయాలు కూల్చివేయడం లేదని, అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. అప్పటి వరకు వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది.


Similar News