ఏపీలో ఎస్ఐ నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ వాయిదా

ఏపీలో ఎస్ఐ నియామక ప్రక్రియపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

Update: 2023-11-30 08:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎస్ఐ నియామక ప్రక్రియపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ దారు తరఫు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. పిటిషన్ దారులు స్వయంగా విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇకపోతే ఎస్ఐ నియామక ప్రక్రియలో ఎత్తుకొలతలకు సంబంధించి తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నియామక ప్రక్రియపై హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి స్టే విధించింది. అయితే స్టేను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. నియామక ప్రక్రియలో ఎత్తు కొలిచే విధానంపై పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఆర్ఎస్ఐగా పనిచేసిన అభ్యర్థిని కూడా ఎత్తు సరిపోలేదంటూ పక్కకు తప్పించడంపై పిటిషన్ దారులు ప్రత్యేకంగా పొందుపరిచారు. ఇకపోతే పిటిషన్ దారు తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. దీంతో అభ్యర్థుల ఎత్తు కొలతలను కోర్టు సమక్షంలో తీసుకోవాలని జడ్జి సూచించారు.

Tags:    

Similar News