HEAVY RAINS.. రాబోయే 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్నాయి. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.

Update: 2024-09-08 02:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్నాయి. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు రోడ్డుపై చేరడంతో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక ఎడతెరిపి లేకుండా పడిన వానతో వాగులు, వంకలు పొంగి పొర్లి ఏపీలో విజయవాడ(VIJAYAWADA), తెలంగాణలో ఖమ్మం(KHAMMAM) జిల్లాల్లో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఇక వర్షాలు తగ్గుముఖం పట్టాయిలే అని ఆనందించే లోపు వాతావరణ శాఖ మరో బిగ్ బాంబ్ పేల్చింది. వాయుగుండం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు స్పష్టం చేశారు. అల్లూరి, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ (RED ALERT) జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్(ORANGE ALERT) జారీ చేసింది. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు.


Similar News