భారీగా వరద .. పడవలపై స్కూళ్లకు విద్యార్థులు

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది...

Update: 2024-07-27 10:52 GMT

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో ఇళ్లు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు, చేమలు, గేదెలు, స్తంభాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. యలమంచిలి మండలం కనకాయలంక గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో ఎటు చూసినా చెరువును తలపిస్తోంది. కనకాయలంక కాజ్‌వే‌పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనకాయలంక నుంచి చాకలిపాలెం స్కూలు‌కు వెళ్లేందుకు పడవలో ప్రయాణం చేస్తున్నారు. వరద నీరు ఉధృతితో ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లకు పడవలపై వెళ్తున్న విద్యార్థుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం త్వరగా స్పందించి స్కూళ్లకు సురక్షితంగా విద్యార్థులను తరలించేలా అధికారులను ఆదేశించాలని కొందరు కోరుతున్నారు. డేంజర్ జర్నీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Tags:    

Similar News