తల్లీకూతుళ్ల అదృశ్యం.. కేసు నమోదు
వేటపాలెం మండలం అక్కాయపాలెంకి చెందిన తల్లీకూతురు అదృశ్యమైన ఘటనకు సంబంధించి శనివారం వేటపాలెం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు
దిశ ప్రతినిధి,బాపట్ల: వేటపాలెం మండలం అక్కాయపాలెంకి చెందిన తల్లీకూతురు అదృశ్యమైన ఘటనకు సంబంధించి శనివారం వేటపాలెం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. గత డిసెంబర్ 31వ తేదీ రాత్రి సలగల స్మైలీ(20) తన రెండేళ్ల కుమార్తె నిత్య ప్రియతో కలిసి చర్చికి వెళ్లి, తర్వాత ఇంటికి తిరిగి రాలేదని, ఎక్కడ వెతికినా, ఎవరిని విచారించిన ప్రయోజనం లేకపోవడంతో స్మైలీ తల్లి వసంత వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు, కనిపించకుండా పోయిన తల్లి బిడ్డల విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.