‘మేము ఇచ్చిన హామీలు మాకు తెలుసు.. చెప్పాల్సిన అక్కర్లేదు’.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచారని వైసీపీ నేతలు(YCP Leaders) విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచారని వైసీపీ నేతలు(YCP Leaders) విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇటీవల మాజీ సీఎం జగన్ టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఆర్థిక మంత్రి(Finance Minister) పయ్యావుల కేశవ్(Payyavula Keshav) ఘాటుగా స్పందించారు. తాము ఇచ్చిన హామీలు తమకు తెలుసని మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ మాకు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించారు. ‘వైసీపీ(YSRCP) హయాంలో రాష్ట్రం అప్పుల కుప్ప గా మారింది. దేశంలోని మరే రాష్ట్రానికి ఇన్ని అప్పులు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచే ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి వెళ్లిపోయారు’ అని ఆయన ధ్వజమెత్తారు.