Rain Alert:ఏపీలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు..!

రుతుపవనాలు మరింత బలపడటంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2024-07-14 09:38 GMT

దిశ,వెబ్‌డెస్క్: రుతుపవనాలు మరింత బలపడటంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో రైతులకు, మత్స్యకారులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17 వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. నేడు మన్యం, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు సూచించారు.


Similar News