ఏపీలో భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు సమీక్ష

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Update: 2024-09-01 07:50 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా విజయవాడలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో నగరంలో సగ బాగం జలమయం అయింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. కాగా ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డ్రోన్, సీసీ కెమెరాలతో వరద పరిస్థితిని అంచనా వేయాలని.. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 50 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత వర్షం పడిందన్న ముఖ్యమంత్రి.. వ్యాధు ప్రబలకుండా మెడికల్‌ క్యాంపులు పెట్టాలని ఆదేశించారు.


Similar News