ఏపీలో దంచికొడుతున్న వానలు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత మూడు రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2023-09-25 04:03 GMT

దిశ,వెబ్ డెస్క్: గత మూడు రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి, పడమటి గాలుల ప్రభావంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని,అలాగే ఈ నెల 27 వరకు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నేడు అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, విజయనగరం, యానాం, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 

Tags:    

Similar News