రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు(Heavy Rains) రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాయి.

Update: 2024-09-10 05:03 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు(Heavy Rains) రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా బుడమేరు వాగు ప్రవహించి బెజవాడను వరద(Floods) నీటితో ముంచెత్తింది. దీంతో వరద(Flood) నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏపీలో వర్షాలు(Rains) తగ్గుముఖం పడుతున్నాయి అనుకుంటుంటే మళ్లీ భారీ వర్షాలు(Heavy Rains) ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వర్షాలు అలాగే వరదలు(Floods) వస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు అలాగే వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు(Schools) సెలవు(Holiday) ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అల్లూరి జిల్లా కలెక్టర్(District Collector) అధికారిక ప్రకటన చేశారు. అంతేకాదు వర్ష ప్రభావం(Rain Effect) ఉన్న ఏలూరు జిల్లా భీమడోలు, పెదపాడు మండపల్లి కైకలూరు ఏలూరు మదనపల్లి, కలిదిండి మండలాల్లో కూడా విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వర్ష ప్రభావం ఎక్కువ ఉందో అక్కడ కచ్చితంగా పాఠశాలలను(Schools) మూసివేస్తున్నారు.


Similar News