బెజవాడలో భారీ వర్షపాతం.. 30 ఏళ్ల రికార్డు బద్దలు

శుక్రవారం, శనివారం బెజవాడలో వర్స బీభత్సం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విజయవాడలో కుంభ వృష్టి వర్షం కురిసింది.

Update: 2024-09-01 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం, శనివారం బెజవాడలో వర్స బీభత్సం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విజయవాడలో కుంభ వృష్టి వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం జలమయం గా మారిపోయింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఒకే రోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనిక తోడు రెండు రోజులు విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నిలిచిన నీరు వచ్చి చేరింది. ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్‌ వరకు నిలిచిన నీరు నదిలా కనిపిస్తుంది. మరోపక్క బెజవాడ గుట్టకు ఆనుకొని ఉన్న ఇల్లపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కూడా విజయవాడలో అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగి ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే పునరావాస ప్రాంతాలను ఏర్పాటు చేశారు.


Similar News