Srisailam Reservoir:శ్రీశైలం జలాశయానికి భారీ వరద..రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా వరదలు బీభత్సం(Panic) సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-12 12:21 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా వరదలు బీభత్సం(Panic) సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ(Vijayawada)ను వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద(Flood) నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది ఇలా ఉంటే..నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి (Srisailam reservoir) ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. స్పిల్‌వే ద్వారా 55,782 క్యూసెక్కులు, ఎగువ నుంచి 1.38 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో శ్రీశైలం 2 గేట్లు (Gates)ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం 884.60 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.80 TMCలు, 213.40 TMCల వరకు నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. ఈక్రమంలో కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో(hydropower stations) విద్యుదుత్పత్తి(Electricity generation) చేసి 68,235 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌(Nagarjuna sagar)కు విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నది(Godavari River) నిలకడగా కొనసాగుతోంది. ఈ ఆనకట్ట వద్ద 15.30 అడుగుల నీటిమట్టం ఉంది. సముద్రంలోకి 15.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.


Similar News