ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలను చుట్టుముట్టిన భారీ వరద

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో భారీ వర్షాలు కురిశాయి.

Update: 2024-09-04 08:01 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా విజయవాడలో కురిసిన కుంభవృష్టి కారణంగా నగరంలోని సగభాగం వరదల్లో చిక్కుకుంది. దీనికి తోడు బుడమేరు వాగు పొంగిపోర్లడంతో మరిన్ని కాలనీలు జలమయం అయ్యాయి. తాజాగా మరోసారి కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్ఫం కారణంగా కేసరపల్లి లో ఉన్న విల్లాలను వరదలు చుట్టుముట్టాయి. ఈ విల్లాలలో ఐఏఎస్. ఐపీఎస్ అధికారులు నివాసం ఉంటున్నారు. కాగా క్రమం క్రమంగా వరద ప్రవాహం విల్లాల వైపు పెరిగిపోతుండటంతో.. అధికారులు ఆ నివాసాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. కాగా ఈ తాజా వరదల కారణంగా బ్రదర్ అనిల్ గెస్ట్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరినట్టు తెలుస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


Similar News