పులిచింతలకు భారీగా వరద.. 4 గేట్లు ఎత్తి నీరు విడుదల
పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది...
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఔట్ ఫ్లో 26, 083 క్యూసెక్కులు కాగా ఇన్ ఫ్లో 30,388 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటి నిల్వ 45.77 టీఎంసీలుకాగా ప్రస్తుతం 3.61 నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేతతో ఈ వరద మరింత పెరగనుందని, రాత్రికి మరికొన్ని గేట్లు ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ మేరకు ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు.