‘కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా?’.. NTK పార్టీ అధినేత సెన్సేషనల్ కామెంట్స్!

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Update: 2024-09-21 07:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తిరుమల లడ్డూ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా అధికారులు, మంత్రులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి ఆలయానికి ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం లడ్డూ ప్రసాదం తీసుకుంటారు. అటువంటి ఈ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా తిరుమల లడ్డూ వివాదం పై తమిళనాడులోని NTK పార్టీ అధినేత సీమాన్ స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడ్డూ తప్ప దేశంలో ఇంకా ఏ సమస్యలు లేవా? అని ప్రశ్నించారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని మండిపడ్డారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి. అంతేగాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయోద్దని విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ పై కావాలనే వివాదం చేస్తున్నారు. ఇతర సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టండి అని మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.


Similar News