గాజువాకలో అడ్డంగా దొరికిపోయిన అమర్‌‌నాథ్... యాక్షన్ షురూ చేసిన జీవీఎంసీ

మాజీ మంత్రి అమర్‌నాథ్‌కి గాజువాకలో ఉన్న భవనానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు...

Update: 2024-06-24 14:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంగా ఆ పార్టీ కార్యాలయాలను అక్రమంగా నిర్మించారంటూ ఆరోపణలు వెల్లువెల్తుతున్నాయి. ఇందులో భాగంగా ఆ కార్యాలయాన్నింటికి ఆయా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేస్తు్న్నారు. తాడేపల్లిలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయాల భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. అలాగే రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన వైసీపీ భవనాలకు నోటీసులు జారీ చేశారు. అయితే విశాఖలో అక్రమంగా నిర్మించారని వైసీపీ కార్యాలయానికి అంటించిన నోటీసులను మాజీ మంత్రి అమర్‌నాథ్ చించేశారు. ఆ కార్యాలయానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు.

అయితే ఈ ఘటన చోటు చేసుకున్న 24 గంటల్లో ఆయనకు భారీ షాక్ తగిలింది. గాజువాకలో ఆయనకు 4 అంతస్తుల భవనం ఉంది. ఈ భవనానికి కూడా అనుమతులు లేవని జీవీఎంసీ అధికారులు తేల్చేశారు. వారంలోపు వివరణ ఇవ్వాలని అమర్‌నాథ్‌‌కు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వని‌పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనసేన కార్పొరేటర్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదులో జీవీఎంసీ అధికారులు కదిలారు. అమర్‌నాథ్ భవనానికి నోటీసులు జారీ చేశారు.


Similar News