తృటిలో తప్పించుకున్న జీవీఎల్ నరసింహారావు
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ప్రమాదం తృటిలో తప్పింది. గుంటూరు మిర్చి యార్డులో ఆయన పర్యటిస్తున్నారు. అయితే జీవీఎల్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లే ముందు గోమాతను నమస్కరించేందుకు జీవీఎల్ ప్రయత్నం చేశారు...
దిశ వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ప్రమాదం తృటిలో తప్పింది. గుంటూరు మిర్చి యార్డులో ఆయన పర్యటిస్తున్నారు. అయితే జీవీఎల్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లే ముందు గోమాతను నమస్కరించేందుకు జీవీఎల్ ప్రయత్నం చేశారు. అయితే జీవీఎల్‌ను గోమాత కాలుతో తన్నింది. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే తేరుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
కాగా శుక్రవారం రాజ్యసభకు హాజరైన ఆయన ఏపీ విభజన హామీలపై మాట్లాడారు. విశాఖలో కాలుష్యం తగ్గించి ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని రాజ్యసభలో సూచించారు. తాజాగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో జీవీఎల్‌కు గోమాత నుంచి అనూహ్య ఘటన ఎదురైంది.
ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కొద్ది రోజులుగా జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో తాము చూపిస్తామని.. జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు.