Sp Vakul Jindal: బాలుడి సజీవ దహనం కేసులో రాజకీయ కోణం లేదు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలుడి సజీవ దహనం కేసుకు సంబంధించి బాపట్ల పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. అనంతరం రిమాండుకు పంపారు...
దిశ, దక్షిణ కోస్తా: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలుడి సజీవ దహనం కేసుకు సంబంధించి బాపట్ల పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. అనంతరం రిమాండుకు పంపారు. మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. ఎస్పీ వకుల జిందాల్ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్‌ను అత్యంత పాశవికంగా పెట్రోలు పోసి దహనం చేశారని తెలిపారు. ఘటనకు పాల్పడిన నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. ఘటనపై సాంకేతిక, సైంటిఫిక్ ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. చనిపోయే ముందు బాలుడి డిక్లరేషన్ కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. ఘటనకు సంబంధించి ఎలాంటి రాజకీయ కోణం లేదని పేర్కొన్నారు. రెండు కుటుంబాల మధ్య వ్యక్తిగత గొడవల వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎస్పీ వకూల్ జిందాల్ వివరించారు.