Amaravati: చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోం..!

సీఎం జగన్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు..

Update: 2023-09-23 17:22 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఎలాంటి తప్పు చేయని చంద్రబాబును అక్రమ కేసు పెట్టి జైలుకు పంపిన జగన్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జగన్  అధికారంలోకొచ్చాక నాలుగేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదన్నారు. తప్పుడు ఆధారాలతో చంద్రబాబును జైలుకు పంపడం జగన్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. బాబు ఎప్పుడూ తప్పు చేయలేదని, తప్పు చేయడని చెప్పారు. చంద్రబాబుపై నోటికొచ్చినట్లు వైసీపీ మంత్రులు మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీ మంత్రులు నోర్లు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

చంద్రబాబు గురించి అనవసరంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. స్కాములు చేయడం చంద్రబాబుకు అలవాటు లేదని, సీఐడీ గాలిని పోగు చేసి చంద్రబాబుపై అవినీతి కట్టుకథలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అవినీతి మచ్చలు అంటగట్టి అన్యాయంగా జైలుకు పంపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్ ఈ చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్ని రాజకీయ పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా జగన్ కనిపించడం లేదన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి పోసాని కృష్ణ మురళికి లేదన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన చంద్రబాబును విమర్శంచడం సిగ్గుచేటన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌తో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా బాబు నిర్దోషిగా బయటకు వస్తారని పాతర్ల రమేష్ ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News