Mangalagiri: సంక్షేమం పేరుతో కోతలు, వాతలే: జీవీరెడ్డి

సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తాము ప్రజలకు ఇచ్చిన హామీలు దాదాపు 100 శాతం పూర్తి చేసినట్టు చెప్పుకుంటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిది జీ.వీ.రెడ్డి అన్నారు. ...

Update: 2023-06-30 16:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తాము ప్రజలకు ఇచ్చిన హామీలు దాదాపు 100 శాతం పూర్తి చేసినట్టు చెప్పుకుంటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిది జీ.వీ.రెడ్డి అన్నారు. పాదయాత్ర చేసినప్పుడు, ఎన్నికల సమయంలో జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలపై ఆయన పార్టీ నేతలంతా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, తరువాత మాట్లాడాలని, అలానే 4 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

“ప్రజలకుఇచ్చిన హామీలన్ని నెరవేర్చానని జగన్, ప్రభుత్వంలోని వారు చెప్పడం శుద్ధ అబద్ధం.. పచ్చిమోసం. హామీల సంగతి జగన్ ఎప్పుడో మర్చిపోయాడు. పోనీ అభివృద్ధి గురించైనా మాట్లాడతాడా అంటే అదీలేదు. ముఖ్యమంత్రి అంటే ప్రజలకు తాను ఇది చేశానని, ఇంతసమర్థవంతగా చేసి, ఇంతమంది జీవితాలు బాగుచేశానని చెప్పుకోవాలి. కానీ జగన్ బటన్ నొక్కడం.. బరితెగించి మాట్లాడటానికే పరిమితమయ్యాడు. బటన్ నొక్కుడు పేరుతో ప్రజల్ని వంచిస్తూ, రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా సర్వనాశనం చేశాడు.’’ అని జీవీరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో 98.5 శాతం అమలు కాదు హామీల అమలులో జగన్ 98.5 శాతం విఫలమయ్యాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని తన ఘనతగా చెప్పుకుంటూ సిగ్గులేకుండా ప్రజలను నమ్మించి ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. నాలుగేళ్లలో జగన్ చేసిన అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో ప్రజలకు కోతలు, వాతలే మిగిల్చాడు అని ధ్వజమెత్తారు. బటన్ నొక్కడు పేరుతో ప్రజలను వంచించి, రాష్ట్రాన్ని పుంజుకోవడానికి వీలులేనంతగా నాశనం చేశారు.’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి మండిపడ్డారు.

Tags:    

Similar News