చంద్రబాబు ప్రాణానికి ముప్పు ఉంది: Gv Anjaneyulu

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీ.వీ ఆంజనేయులు హెచ్చరించారు...

Update: 2023-10-13 15:23 GMT

దిశ, వినుకొండ: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీ.వీ ఆంజనేయులు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గిపోయి, జైల్లో ఒక్క పూతతో స్కిన్ డిసీజులు వచ్చి ఇబ్బంది పడుతున్నారని, అరాచక ప్రభుత్వం ఆయనను మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. జైలు అధికారి సెలవు పెట్టడం లాంటి అంశాలు చూస్తుంటే పలు అనుమానాలకు దారి తీస్తుందని, జైలు అధికారుల నిర్లక్ష్యం జగన్ రెడ్డి కుట్రలో భాగమేనని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల జైలు అధికారులు జాగ్రత్తలు వహించాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో చంద్రబాబుకు వైద్య సేవలు అందించాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసేందుకు జననీ ఫౌండేషన్ తీసుకొచ్చి మూడు నెలల ముచ్చటగా ముగించి మోసం చేశారని జీవీ ఆంజనేయులు చెప్పారు. రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తాను స్థాపించిన శివశక్తి ఫౌండేషన్ నేటికీ పేద ప్రజలకు సేవలు అందిస్తూనే ఉందన్నారు. వినుకొండ నియోజకవర్గంతో పాటు చాలా ప్రాంతాల్లో ప్రజలకు కంటి ఆపరేషన్లు చేయించి కంటి చూపుని ప్రసాదించిన సంస్థ శివశక్తి ఫౌండేషన్ అని తెలిపారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తన రాజకీయ స్వార్థం కోసం శివశక్తి ఫౌండేషన్‌పై దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కంటి ఆపరేషన్లకు అందత్వ నివారణ సంస్థ నేరుగా శంకర కంటి నేత్రాలయానికి నిధులు ఇస్తుంది తప్ప ఫౌండేషన్‌కు ఇవ్వదన్న విషయం తెలియకపోవటం అవివేకమని విమర్శించారు. అధికారం అడ్డం పెట్టుకొని కోట్లు దోచుకున్న బొల్లా బ్రహ్మనాయుడుకి సేవలు కనపడకపోవడం అంధత్వానికి నిదర్శనమన్నారు. ప్రజలకు సేవలు అందిస్తున్న శివశక్తి ఫౌండేషన్‌పై దుష్ప్రచారం చేస్తే ప్రజలు సహించరని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News