ఆ పూచీ నాది.. చేనేతలకు నారా లోకేష్ భరోసా

చేనేతలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు...

Update: 2023-12-29 15:37 GMT

దిశ, ఏపీ బ్యూరో: చేనేతలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం చేనేత కార్మికులు, ఆ సామాజికవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ చేనేతల ఆదాయం పెంచేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటానన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఉద్యోగులు, కార్మికులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి దేశమంతా పరిశీలించి మెరుగైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జగన్ రెడ్డి బటన్ నొక్కి పేదలను ఉద్దరిస్తున్నానని చెప్పుకుంటూ.. మరో బటన్ నొక్కి పేదల జేబులు ఖాళీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. పేదలను సొంత కాళ్లపై నిలబెట్టడం ద్వారానే శాశ్వత ప్రయోజనాలు సాకారమవుతాయన్నారు. జగన్ రెడ్డికి ప్రజల ఆదాయం, రాష్ట్ర ఆదాయం పెంచడంపై కనీస శ్రద్ధ లేదని, అందుకే అప్పులు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపారు. హ్యాండ్ లూమ్, పవర్ లూంను వేర్వేరుగా అభివృద్ధి చేయడానికి ఉన్న మార్గాలను పరిశీలించి ఆ దిశగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేనేత రంగాన్ని ఆధునిక పద్దతులు, పరిస్థితులకు తగ్గట్లు డిజైన్లపై శిక్షణ అవసరమన్నారు. డిజిటల్ కాలంలో మనం కూడా కాలానికనుగుణంగా పరుగులు పెట్టాలంటే, అందుకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం.. ఆ మేరకు ప్రోత్సాహం అందించి చేనేత రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని నారా లోకేష్ భరోసానిచ్చారు.

Tags:    

Similar News