నారా లోకేశ్‌పై కేశినేని నాని తీవ్ర ఆగ్రహం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు..
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. తాత, తండ్రి పేర్లు, పార్టీ బలాన్ని వాడుకున్నా లోకేశ్ మంగళగిరిలో గెలవలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా ఆమోదం తర్వాత వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకేశ్‌కు ఏం అర్హత ఉందని పాదయాత్ర చేశారని ప్రశ్నించారు. లోకేశ్ ఏం త్యాగం చేశారని పాదయాత్రల పేరుతో హడావుడి చేశారని నిలదీశారు. లోకేశ్ పాదయాత్రకు తాను ఎదురు వెళ్లి స్వాగతం చెప్పాలా నాని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అండగా లేకపోయినా తాను గెలిచానని నాని వ్యాఖ్యానించారు. లోకేశ్ ఒక ఓడిపోయిన వ్యక్తి అని కేశినేని నాని ఎద్దేవా చేశారు.
తన కుటుంబంలో చిచ్చు పెట్టారని కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతోనే తనను కొట్టించాలని చూశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని అభివర్ణించారు. విజయవాడను అభివృద్ధి చేయాలని చంద్రబాబుకు లేదన్నారు. టీడీపీ హయాంలో విజయవాడ అభివృద్ధికి కనీసం రూ.100 కోట్లు ఇవ్వలేదని తెలిపారు. తాను ఒక్కడినే టీడీపీ నుంచి వెళ్లడంలేదని.. ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 60 శాతం నాయకులు గుడ్ బై చెబుతారని కేశినేని జోస్యం చెప్పారు.
Read More : సీఎం జగన్‌తో ముగిసిన కేశినేని నాని భేటీ....వైసీపీలో చేరడంపై టీడీపీ ఎంపీ నాని కీలక ప్రకటన