AP Politics:హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదు: నారా లోకేష్
హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదు. చంద్రబాబు ఏనాడూ హత్యా రాజకీయాలు ప్రోత్సహించలేదు. నీతి, నిజాయితీతో పనిచేశారు. కత్తి పట్టుకున్న వారు ఆ కత్తితోనే నాశనం అవుతారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.
దిశ ప్రతినిధి,గుంటూరు: హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదు. చంద్రబాబు ఏనాడూ హత్యా రాజకీయాలు ప్రోత్సహించలేదు. నీతి, నిజాయితీతో పనిచేశారు. కత్తి పట్టుకున్న వారు ఆ కత్తితోనే నాశనం అవుతారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోరంపూడి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా మంగళగిరిని తీర్చిదిద్దుతా అన్నారు. భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు.
ఈ సందర్భంగా మోరంపూడి వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దళిత స్మశాన వాటిక ప్రహరీ గోడ, గది నిర్మించాలి. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి. ముస్లిం ఖబరస్థాన్‌కు స్థలం కేటాయించాలి. మహంకాళి అమ్మవారి దేవస్థానంకు వెళ్లే రహదారిని విస్తరించాలి. చర్చికి టవర్ నిర్మించాలి. వైఎస్సార్ చేయూత పథకం అందడం లేదు. గ్రామంలో హైస్కూల్ నిర్మించాలి. విద్యార్థులకు ఆటస్థలం ఏర్పాటు చేయాలి.
లోకేష్ స్పందిస్తూ.. దామాషా ప్రకారం శ్మశాన వాటికలకు స్థలం కేటాయిస్తాం. దళితుల స్మశాన వాటికను అభివృద్ధి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు కుళాయి ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తాం. అమ్మవారి దేవస్థానం రహదారిని విస్తరిస్తాం. చర్చికి టవర్ విషయంలో పరిశీలించి నిర్ణయం చర్యలు తీసుకుంటాం. కోతలు లేకుండా సంక్షేమం అమలు చేస్తాం. హైస్కూల్, ఆటస్థలం విషయంలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.