Pawan Kalyan: అలా ఎందుకు చేశారు.. బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

Update: 2023-03-11 13:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రావాళ్లను తిట్టారన్న విషయం తెలుసునని ఆనాటి పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలని సూచించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 26 ఉప కులాలను బీసీల జాబితా నుంచి ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.

26 ఉపకులాలను తొలగించినప్పుడు జనసేన పార్టీ మాత్రమే పోరాటం చేసిందని, ఏపీలోని వైసీపీ బీసీ మంత్రులు, బీసీల ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడలేదని పవన్ వ్యాఖ్యానించారు. బీసీ నేతలుగా పిలవబడుతున్న ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలు ఏం చేస్తున్నారని నిలదీశారు. 26 కులాలను బీసీ జాబితా నుంచి ఎందుకు తొలగించారనే దానిపై బీఆర్ఎస్ శ్రేణులు వివరణ ఇవ్వాలని సూచించారు. దీనిపై ఎందుకు పోరాటం చేయలేదో బీసీలకు వైసీపీ, టీడీపీ వివరణ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ డిమాండ్ చేశారు.

Read more:

నన్ను ఒకే కులానికి పరిమితం చేయెుద్దు: Pawan Kalyan 

విచారణకు వెళ్లేముందు కవిత కట్టుకున్న చీర ఇదే..!

Tags:    

Similar News