రఘురామ కేసు.. ఐపీఎస్ అధికారి విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ
టీడీపీ ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి విజయ్ పాల్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ ఎదురైంది...
దిశ, వెబ్ డెస్క్: నర్సాపురం మాజీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు(Mla Raghuram Raju)పై కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial torture Case)లో ఐపీఎస్ అధికారి విజయ్ పాల్ (IPS officer Vijay Pal)కు హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని 2021లో రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదు అయింది. ఆ కేసు విచారణలో భాగంగా ఆయనను కస్టడీకి తీసుకున్నారు. అయితే తనను పోలీసులు టార్చర్ చేశారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ ఆరోపించారు. ఐపీఎస్ అధికారి విజయపాల్‌పై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఐపీఎస్ అధికారి విజయ్ పాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరారు. అయితే హైకోర్టులో విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది.