మద్యం మత్తులో కానిస్టేబుల్, హోంగార్డు ఘర్షణ.. ఇద్దరిని సస్పెండ్ చేసిన అధికారులు

మద్యంమత్తులో హోంగార్డు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఘర్షణ పడ్డారు...

Update: 2024-12-29 03:47 GMT

దిశ, వెబ్ డెస్క్: మద్యంమత్తులో హోంగార్డు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. పరస్పరం దాడి చేసుకున్నారు. హోంగార్డు శ్రీనివాసరావుపై లాఠీతో కానిస్టేబుల్ మల్లికార్జునరావు దాడి చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాతో పాటు స్థానికంగా వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కొట్లాటలను పరిష్కరించాల్సిన ఖాకీలే తెగబడి రోడ్డుపై దాడి చేసుకుంటుంటే సమస్యలు ఎవరికి చెప్పాలంటూ సెటైర్లు పేలాయి. దీంతో హోంశాఖ సీరియస్ అయింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. దాడి చేసుకున్న ఇద్దరినీ సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు హోంగార్డు, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 


Similar News