Strong Counter: అది మాయిష్టం.. మీకెందుకు?: మాజీ మంత్రి పత్తిపాటి
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని సీఎం జగన్ సవాల్ విసిరడమేంటని మాజీమంత్రి మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు....
దిశ, డైనమిక్ బ్యూరో: 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని సీఎం జగన్ సవాల్ విసిరడమేంటని మాజీమంత్రి మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో అనేది పార్టీ విధి విధానాల మీద ఆధారపడి ఉంటాయని.. ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైతే పొత్తుకు అయినా వెళ్లాల్సి ఉంటుందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పల్నాడులో శుక్రవారం మాజీమంత్రి మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటిరిగా పోటీ చేస్తామని..ఇతర పార్టీలు కూడా ఒంటిరిగా పోటీ చేయాల్సిందేనంటూ వైఎస్ జగన్ చేస్తు్న్న వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని అన్నారు.
151 ఎమ్మెల్యేలకు సీట్లు ఉంటాయా..?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసురుతున్న వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలకు సీట్లు ఉంటాయని ప్రకటించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. టీడీపీతో పొత్తుకు చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. జగన్‌కు ధైర్యం ఉంటే ఉద్యోగుల జీతాలు ఒకటవ తారీఖున ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీకి దమ్ముంటే ఇప్పడు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పేదవారికి జగన్ ప్రభుత్వం గుదిబండగా తయారైందన్నారు. వైసీపీ పాలనలో పేదవారు బ్రతకలేని పరిస్థితికి వచ్చేశారని మాజీమంత్రి మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.