Amaravati: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని దేశంలో వేల పోరాటాలు జరిగాయని, కాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సుదీర్ఘ న్యాయపోరాటం చేసిందని సీఎం జగన్ తెలిపారు. ...
దిశ, వెబ్ డెస్క్: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దేశంలో వేల పోరాటాలు జరిగాయని, కాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సుదీర్ఘ న్యాయపోరాటం చేసిందని సీఎం జగన్ తెలిపారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణి చేసిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేవారు. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ.. 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటననన్నారు. ఇళ్లస్థలాలు ఇవ్వకుండా మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారని జగన్ మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళి పోరాడిందని తెలిపారు. నేడు అదే అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ళ స్థలాలకు 50,793 మంది అక్కచెల్లెమ్మలను యజమానులను చేసింది మన ప్రభుత్వమన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే అవకాశాన్ని తనకు కల్పించిన దేవుడికి, ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని సీఎం జగన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Ap News: ముందస్తు ఎన్నికలపై కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
అమరావతిలో ఉద్రిక్తత.. కళ్లకు గంతలు కట్టుకుని నల్లబెలూన్లతో రైతుల నిరసన
Janasena: వచ్చే ఎన్నికలపై రహస్య సర్వే.. దూకుడు పెంచిన జనసేనాని