ఆ 122 మంది ఉద్యోగులు ఇకపై తెలంగాణకే.. ఉత్తర్వులు జారీ..!

తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది...

Update: 2024-08-14 05:20 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. దీంతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఊరట కలిగింది. ఇకపై వారంతా తెలంగాణలో పని చేయనున్నారు. 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేయాలన్ని టీజీ ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ మేరకు 122 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రిలీవ్ అవుతున్న వారు తమ క్యాడర్ చివరి స్థానంలో ఉంటారన్న తెలిపింది. ఇందుకు ఉద్యోగులు అంగీకరించారు. దీంతో వారిని రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

కాగా ఏపీ పునర్ వ్యవస్థీకరణ జరిగిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణకు చెందిన కొందరు ఏపీలో.. ఏపీకి చెందిన మరికొందరు ఉద్యోగులో తెలంగాణలో పని చేస్తున్నారు. దీంతో సొంతూళ్లకు వెళ్లేందుకు తెలంగాణ ఉద్యోగులు పదేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయంల, హెచ్ వోడీ కార్యాలయాలు, 9,10వ షెడ్యూల్‌ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు.. సీనియారిటీ కోల్పోయినా సరే తమను తెలంగాణకు రిలీవ్ చేయాలని తెలుగు ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు రెండు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 122 మంది తెలంగాణ ఉద్యోగుల సమస్యకు చెక్ పడింది.

Tags:    

Similar News