మున్సిపల్ కార్మికులను హీనంగా చూస్తున్న ప్రభుత్వం... సీఎం జగన్‌పై బాలకృష్ణ ఫైర్

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, తమ డిమాండ్లను నెరవేర్చమని సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం హీనంగా చూస్తోందని హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు.

Update: 2024-01-09 12:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, తమ డిమాండ్లను నెరవేర్చమని సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం హీనంగా చూస్తోందని హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన హిందూపూర్‌లో మునిసిపల్ కార్మికుల సమ్మె చేస్తున్న శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే ప్రజలు మనుగడ లేదని పేర్కొన్నారు. తెలతెలవారగానే చీపురు పట్టుకుని రోడ్లపైకి సాయంత్రం వరకు మున్సిపల్ కార్మికులు గొడ్డు చాకిరీ చేస్తున్నారని తెలిపారు. రోజులు గడుస్తున్నా.. సమ్మె చేస్తున్న వారికి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.

నాడు జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు ఎన్నికల సందర్భంగా వస్తున్నాడని ఎద్దేవా చేశారు. పైశాచిక ప్రభుత్వంలో అన్ని రంగాలు చతికిలపడ్డాయని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు ఆవేశంతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారందరికీ టీడీప ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బాలకృష్ణ అన్నారు.  

Tags:    

Similar News