volunteers: వాలంటీర్లకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు సర్కార్
గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా..? పక్కన పెడుతుందా..? అని ఆంధ్రప్రదేశ్
దిశ, వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా..? పక్కన పెడుతుందా..? అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని, జగన్ కంటే ఎక్కువ గౌరవ వేతనం (రూ.10 వేలు) ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఉలుకు లేదు పలుకు లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి క్రమంగా నేరవేర్చకుంటూ పోతున్న చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లకు తమ భవిష్యత్‌పై సంధిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతోన్న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయస్వామి ఆన్సర్ ఇచ్చారు.. ‘‘ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని. వారికిచ్చే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపైన కసరత్తు చేస్తున్నాం’ అని మంత్రి క్లారిటీ ఇచ్చారు. మంత్రి వీరాంజనేయస్వామి క్లారిటీతో గత కొంత కాలంగా నెలకొన్న సంధిగ్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన తాజా ప్రకటనతో దాదాపు 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు.
Read More..
YS Sharmila:నడుం లోతు నీళ్లలో షర్మిల..రైతులను ఆదుకోవాలని వినతి