TTD:తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. గంటలోనే శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఉంటుంది. దీంతో భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల సమస్యల దృశ్య టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు. ఈ టెక్నాలజీని వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే ఈ నెల 24న జరగనున్న పాలకమండలిలో ఆమోదం లభించనుంది.
గంటలోపే దర్శనం చేయించడానికి మొదటగా వారి ఆధార్ కార్డు నంబర్, ఫేస్ రికగ్నేషన్ రసీదు ఇస్తారు. అందులో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ అందిస్తారు. ఈ టోకెన్ తీసుకున్న సందర్శకులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్‌లో స్కానింగ్ అనంతరం క్యూ లైన్‌లోకి పంపుతారు. గంట సమయంలో పే స్వామివారి దర్శనం పూర్తవుతుంది. ఈ టోకెన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బందితో పని లేకుండా ఎఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయనున్నారు. ఈ విధానం అమలుకు ఎఐ సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి ద్వారా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం సక్సెస్ అయితే భక్తులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది.