నిరుద్యోగులకు గుడ్ న్యూస్..భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పిఠాపురంలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు.

Update: 2024-08-25 03:28 GMT

దిశ,వెబ్‌డెస్క్:నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పిఠాపురంలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక SFS స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ మేళాకు 2,790 మంది నిరుద్యోగ యువతీ యువకులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని అన్నారు. నిరంతరాయంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 40 కంపెనీల్లో ఉద్యోగాలకు ఆయా కంపెనీ ప్రతినిధులు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు వేతనం లభించే ఉద్యోగాలకు 783 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా నియామక ఉత్తర్వులు అందజేశారు. జాబ్‌మేళాకు హజరైన నిరుద్యోగులకు నిర్వహకులు భోజన సదుపాయం కల్పించారు.


Similar News