Holiday:విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ఈ నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ముఖ్యమైన పండుగలతో పాటు ఆదివారాలు కూడా ఉండటంతో వరుస సెలవులు వచ్చాయి.

Update: 2024-08-25 05:46 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఈ నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ముఖ్యమైన పండుగలతో పాటు ఆదివారాలు కూడా ఉండటంతో వరుస సెలవులు వచ్చాయి. ఇప్పటికే ఆగస్టు 18 ఆదివారం కాగా ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి సందర్భంగా వరుస సెలవులు వచ్చాయి. అంతేకాదు ఈ నెల 24వ తేదీన నాలుగో శనివారం, 25న ఆదివారం, 26న కృష్ణాష్టమి ఉండటంతో 25, 26 తేదీల్లో సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 26వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. సోమవారం(రేపు) పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పేర్కొన్నాయి. అన్ని రకాల విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవు. ఏపీలో రేపు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం సైతం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు ప్రకటించారు.


Similar News