AP:పశువుల పెంపకం దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పశువుల పెంపకం దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
దిశ ప్రతినిధి,విజయవాడ : ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పశువుల పెంపకం దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పశువుల షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70 శాతం రాయితీ ఇస్తుంది. యూనిట్‌కు గరిష్టంగా రూ.60,900 నుంచి రూ.2,07,000 వరకు పెంపకందారులు లబ్ధి చేకూరనుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘గోకులం’ పేరుతో దీన్ని అమలు చేయనుంది.