అమరావతి రైతులకు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో లాటరీ
అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..
దిశ, వెబ్ డెస్క్: అమరావతి రైతుల(Amaravati Farmers)కు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్(Coalition Government Good News) తెలిపింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల(Returnable Plots)ను సీఆర్డీఏ అధికారులు కేటాయించనున్నారు. ఈ మేరకు గురువారం లాటరీ తీసి ప్లాట్లు అప్పగించనున్నారు. 2014-19లో 14 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించిన విషయం తెలిసిందే. అయితే ఆ భూములకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల రైతులకు ప్లాట్లు అప్పగించనున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకూ ఆన్ లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్లాట్లు కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. 14 గ్రామాల ప్రజలు ఈ లాటరికీ హాజరుకావాలని సీఆర్డీఏ(Crda) పిలుపునిచ్చారు.