ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలోనే చిరంజీవి.. ఎన్నికల వేళ బింగ్ బాంబ్ పేల్చిన గిడుగు రుద్రరాజు

ప్రజా రాజ్యం పార్టీ స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని కాంగ్రెస్‌లో

Update: 2024-04-09 09:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా రాజ్యం పార్టీ స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్య సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజకీయాలకు దూరమైన మెగాస్టార్.. సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరు.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో చిరు పొలిటికల్ స్టేటస్‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. తమ్ముడు కాబట్టి పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఆర్థిక సహయం చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సభ్యులుగా కొనసాగుతున్నారని.. ఇంతవరకు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయలేదని బిగ్ బాంబ్ పేల్చారు. కొందరు చిరంజీవిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిశోర్ ఓ పెయిట్ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కల్యాణ్ అని కొత్త అర్థం చెప్పారు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఓ వలస పక్షి అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే రాజమండ్రి అభవృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. కాగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గిడుగు రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, సోమవారం జనసేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు. దీంతో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని గిడుగు రుద్రరాజు క్లారిటీ ఇచ్చారు.


Similar News