Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. నేడు గరుడవాహన సేవ
తిరుమల (Tirumala)లో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు (Padmavati Brahmotsavam) వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం అమ్మవారిని సర్వభూపాల వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు.
దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు (Padmavati Brahmotsavam) వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం అమ్మవారిని సర్వభూపాల వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవ సేవ, రాత్రికి గరుడవాహన సేవ నిర్వహించనున్నారు. గరుడవాహన సేవ (Garuda Vahana Seva)కు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో.. సుమారు 2 వేల మంది పోలీసులు, విజిలెన్స్ అధికారులు, ఇతర సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
కాగా.. నేడు తిరుమలలో స్థానికులకు దర్శనం కల్పించనుంది టీటీడీ (TTD). ఈ మేరకు నిన్న 3000 దర్శనం టోకెన్లను భక్తులకు అందజేసింది. ప్రతి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒకసారి దర్శనం చేసుకున్న భక్తులకు మళ్లీ 90 రోజుల తర్వాతే దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని టీటీడీ స్పష్టం చేసింది. ఇందుకోసం ఆధార్ కార్డులను లింక్ చేస్తూ టోకెన్లు ఇస్తోంది. ప్రతి సోమవారం టీటీడీ స్థానికులకు ఉచిత దర్శన టోకెన్లను అందించనుంది.