Ganesh Laddu Auction : గణేశుడి లడ్డూ వేలంలో రికార్డ్ బ్రేక్..ఎక్కడంటే?

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్.

Update: 2024-09-16 03:34 GMT

దిశ,వెబ్‌డెస్క్:హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. తర్వాతి కాలంలో వాడవాడలా గణేశుని లడ్డూలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రజెంట్ లడ్డూ వేలంపాట ఏకంగా రూ.లక్షల్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం కాలం మారింది.. బాలపూర్‌ను మించి కూడా గణపతి లడ్డూలు వేలంపాటలో రికార్డు ధర(Record price) పలుకుతోంది. అయితే తెలంగాణలో(Telangana) మాత్రమే కాదు ఆంధ్రాలో కూడా గణపతి లడ్డూ వేలం పాటకు జనాల్లో క్రేజ్ పెరిగింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూ ధరతో పోటీపడుతూ భారీ ధర పలికింది.

వివరాల్లోకి వెళితే..విజయవాడ(Vijayawada) రూరల్ మండలం నున్నలోని శ్రీసాయి బాలాజీ ఎన్‌క్లేవ్‌ అపార్టుమెంట్‌లో వినాయకుడని ఏర్పాటు చేశారు. విగ్రహం దగ్గర ఆదివారం నిర్వహించిన స్వామి వారి లడ్డూ ప్రసాదం వేలంలో విపోదా ఫిన్‌స్పైర్‌ సొల్యూషన్స్‌(Finspire Solutions) కంపెనీ ఎండీలు సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నక్కా రామ్‌ బాలాజీలు రూ.26 లక్షలకు లడ్డూని సొంతం చేసుకున్నారు. లడ్డూను వేలంపాటలో దక్కిచుకున్న ప్రదీప్‌రెడ్డి, రామ్ బాలాజీలను ఉత్సవ కమిటీ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. గణపతి లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి. తాను రాబోయే రోజుల్లో అపార్టుమెంట్‌(Apartment) అభివృద్ధి కార్యక్రమాలకు, వచ్చే ఏడాది చవితి వేడుకలు మరింత వైభవంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే రూ.26 లక్షల పెద్ద మొత్తానికి వినాయక లడ్డు పాట పాడామని తెలిపారు.


Similar News