AP News:‘జగన్ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టులకు గండ్లు’..మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఆగిపోయిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.

Update: 2024-08-30 10:30 GMT

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఆగిపోయిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. అయితే నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం పై మంత్రి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనట్లు మంత్రి నిమ్మల చెప్పారు.

వరదల సమయంలో 90 రోజుల పాటు 53 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా గత టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ రూపకల్పన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కృష్ణా నదికి వరద పోటెత్తడంతో సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు 15 రోజుల ముందుగానే సాగునీరు విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్షలో ఆయన మాట్లాడుతూ..‘జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టులకు గండ్లు పడుతున్నాయి. చింతలపూడి పథకాన్ని పట్టించుకోలేదు. ఇది పూర్తయితే ప.గో, కృష్ణా జిల్లాల్లోని 4.80లక్షల ఎకరాలకు సాగునీరు, 26 లక్షల మందికి తాగునీరు అందుతుంది’ అని చెప్పారు.


Similar News