డోన్‌లో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లు వసూలు
నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ..
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ(Crypto currency)పేరుతో రామాంజనేయులు అనే వ్యక్తి కర్నూలు(Kurnool), నంద్యాల(Nandyala), మహబూబ్‌నగర్(Mahabubnagar)జిల్లాల్లో 300 మందిని మోసం చేశారు. రూ.లక్ష పెట్టుబడిపెడితే నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ నమ్మించారు. అలా దాదాపు రూ.25 కోట్లు వసూలు చేశారు.
2021లో కేవ-ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలను ఆంజనేయులు పరిచయం చేసుకున్నారు. నంద్యాలతో పాటు చుట్టు ప్రాంతాల్లో క్రిప్టో దందా నిర్వహించారు. మధ్యతరగతి కుటుంబాలు, వ్యాపారులు, యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రియల్ వ్యాపారులను క్రిప్టో దందావైపు ఆకర్షించారు. అంతేకాదు కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు ఆంజనేయులు నమ్మబలికారు. దీంతో లక్షలు సమర్పించుకున్నారు. అలా రూ. 25 కోట్ల మేర వసూలు చేసి ఆంజనేయులు పరారయ్యారు.
దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. కాగా అనంతపురం జిల్లా పెద్దవడుగురుకు చెందిన ఆంజనేయులు అక్కడ కూడా రూ. 90 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.