Tirupati: తిరుమలలో తగ్గిన భక్తుల రద్ధీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
మంగళవారం తెల్లవారుజామున తిరుమల తిరుపతి(Tirupati)లో భక్తుల రద్ధీ సాధారణ స్థాయికి చేరుకుంది.
దిశ, వెబ్ డెస్క్: మంగళవారం తెల్లవారుజామున తిరుమల తిరుపతి(Tirupati)లో భక్తుల రద్ధీ సాధారణ స్థాయికి చేరుకుంది. రెండు రోజుల క్రితం వరకు దీపావళి(Diwali) సెలవులు ఉండటంతో తిరుమల తిరుపతికి భక్తుల తాకిడి(Clash of devotees) ఘననీయంగా పెరిగింది. కాగా సోమవారంతో సెలవులు ముగియడం, కార్తీక మాసం ప్రారంభం కావడంతో శైవ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఈ క్రమంలో తిరుమలకు భక్తుల తాకిడి(Clash of devotees) కాస్త తగ్గింది. మంగళవారం ఉదయం మొత్తం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని, నిన్న(సోమవారం) శ్రీవారిని 74,651 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,712 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. హుండీ ఆదాయం మొత్తం రూ.4.14 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.