Deputy Cm: రేపు పల్నాడు జిల్లాకు పవన్.. జగన్ భూముల పరిశీలన

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం పల్నాడు జిల్లాకు వెళ్లనున్నారు...

Update: 2024-11-04 17:04 GMT

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) మంగళవారం పల్నాడు జిల్లా(Palnadu District)కు వెళ్లనున్నారు. జగన్‌కు చెందిన సరస్వతి పవర్ భూముల(Saraswati Power Lands)ను ఆయన పరిశీలించనున్నారు. మాచవరం మండలంలో సరస్వతి పవర్‌కు కేటాయించిన 1515.93 ఎకరాల్లో అటవీ భూములు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ భూములపై పవన్ ఫోకస్ పెట్టారు. సర్వే చేపట్టాలని అధికారులు ఆదేశించారు. దీంతో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు రీ సర్వే చేసి భూముల రికార్డులను పరిశీలించారు. అనంతరం నివేదికను పవన్ కల్యాణ్ అందజేశారు. దీంతో సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలించనున్నారు. మంగళవారం ఉదయం ఆ భూముల వద్దకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 


Similar News