ఏపీలో ఫాక్స్ కాన్ పెట్టుబడులు

ఏపీలో ఫాక్స్ కాన్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

Update: 2024-08-19 16:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఫాక్స్ కాన్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఒప్పందం ఈరోజు నారా లోకేష్ నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, వనరులను ఫాక్స్ కాన్ సంస్థకు తెలియజేశారు నారా లోకేష్. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకు వస్తామని వారికి తెలియజేశారు. ఏపీలో పెట్టుబడుల కోసం వచ్చే కంపెనీలకు పలు రాయితీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ మెగా సిటీని నిర్మించాలని, అందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు తమ ప్రభుత్వం అందిస్తుందని ఫాక్స్ కాన్ ప్రతినిధులకు లోకేష్ వివరించారు. త్వరలోనే ఏపీలో ఈవీ వాహనాలు, సెమీ కండక్టర్లు, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపొనెంట్స్ కి సంబంధించిన యూనిట్స్ నెలకొల్పుతున్నట్టు ఫాక్స్ కాన్ మీడియాకు తెలిపింది. 


Similar News