అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తి...ఈనెల 17న భారీ బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తవుతుంది.

Update: 2023-12-10 06:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో :  ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తవుతుంది. దీంతో ఈ నెల 17న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. రాజధానిని గత ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయగా..2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు ప్రకటించారు. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి రైతులు ఆందోళనలకు దిగారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం సాగిస్తున్నారు. అంతేకాదు అమరావతి రైతులు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ వివాదం నడుస్తుంది. అయినప్పటికీ అమరావతి ప్రాంత రైతులు నేటికి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బహిరంగ సభను ఈ నెల 17న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News